ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలకు ఇవాళ రికార్డు స్థాయిలో నడకదారి భక్తులు చేరుకున్నారు. కాలినడకన ఇప్పటికే 40 వేల మంది భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఈ రాత్రికి ఈ సంఖ్య 45 వేలకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాలినడకన తిరుమలకు చేరుకున్న భక్తులను క్యూలైన్ లోకి అనుమతించడం లేదు. ఇప్పటికే దివ్యదర్శనం క్యూలైన్ లో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి 13 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. తమను దర్శనానికి అనుమతించాలని నడకదారి భక్తులు కోరుతుండగా, రేపు అనుమతిస్తామని టీటీడీ అధికారులు చెబుతున్నారు.