రానున్న మూడు రోజులు భారీ వర్షాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు

రానున్న మూడు రోజులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన కారణంగా ఏపీతో పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. అల్పపీడనం కారణంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, దీని కారణంగా ఉత్తరకోస్తాలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అలాగే తెలంగాణలోని ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌, మెదక్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భీమవరంలో 14, తునిలో 11 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, కోస్తాంధ్రలో 5 సెం.మీ వర్షపాతం నమోదైందని విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది.

More Telugu News