ముగింపు వేడుకలిలా... అంతిమ సమరం అలా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగింపు వేడుకలిలా... అంతిమ సమరం అలా

ప్రపంచ కప్ ఫుట్ బాల్ అంతిమ సమరానికి ముందు ముగింపు వేడుకలు రసవత్తరంగా జరుగనున్నాయి. భారత కాల మానం ప్రకారం రాత్రి 10:50 నిమిషాలకు ముగింపు వేడుకలు ప్రారంభం కానుండగా, వేడుకల్లో కొలంబియా పాప్ స్టార్ షకీరా ఆడిపాడనుంది. బ్రెజిల్ ఆర్టిస్ట్ కార్లినో బ్రౌన్ తో కలిసి ఫిఫా అధికారిక గీతం 'లా లా లా' ను ఆలపించనుంది. ప్రముఖ గిటారిస్ట్ కార్లోస్ శాంటనా, వెసైల్ఫ్ జిన్ తో కలసి ప్రదర్శన నిర్వహించనున్నారు. అనంతరం బ్రెజిల్ సూపర్ స్టార్ సాంగాలో, అలెగ్జాండర్ పెరైస్ తో కలిసి సందడి చేయనున్నారు. ఫైనల్ ప్రారంభానికి ముందు స్పెయిన్ ఫుట్ బాలర్ కార్లెస్ పుయోల్, బ్రెజిల్ సూపర్ మోడల్ గిసెల్ బండ్చెన్ తో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని ఆవిష్కరిస్తారు. వెంటనే జర్మనీ, అర్జెంటీనా మధ్య అంతిమ పోరాటం ప్రారంభమవుతుంది. జర్మనీ మెస్సీని నిలువరించేందుకు ప్రణాళికలు రచిస్తుండగా, అర్జెంటీనా అటాకింగ్ ను ఎంచుకోనుంది. సెమీఫైనల్ మ్యాచ్ లో మెస్సీని కట్టడి చేసిన డచ్ సేన గోల్స్ నమోదు కాకుండా అడ్డుకుంది. ఇదే వ్యూహాన్ని జర్మనీ అమలు చేయనుంది. అయితే జట్టు నిండా స్టార్స్ ఉన్న జర్మనీని అర్జెంటీనా అడ్డుకుంటుందా? అనేదే సందేహం. జర్మనీని మెస్సీ ఏమారిస్తే మిగిలిన జట్టు రెచ్చిపోవాలని వ్యూహ్యాన్ని మారడోనా అర్జెంటీనా జట్టుకు సూచిస్తున్నాడు.

More Telugu News