మణిపూర్ లో బాంబు పేలుడు, ఏడుగురికి గాయాలు
మణిపూర్ రాజధాని ఇంఫాల్ సమీపంలో శనివారం జరిగిన బాంబు పేలుడులో ఏడుగురు గాయాలపాలయ్యారు. క్షతగాత్రుల్లో ఆరేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. ఇంఫాల్ కు 10 కిలోమీటర్ల దూరంలోని లంగ్తాన్ బాల్ వద్ద జరిగిన ఈ పేలుడును, అటుగా వెళుతున్న సాయుధ బలగాలను లక్ష్యంగా చేసుకుని మిలిటెంట్లు జరిపినదిగా పోలీసులు భావిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటీన సంఘటన స్థలం వద్దకు చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.