పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేందుకు కేంద్రం ఆమోదం తెలపడంతో తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. నిన్నటి వరకు... 'రాష్ట్ర సాధనకు ఉద్యమాలు చేశాం... మేమే ఛాంపియన్, లోక్ సభలో సుష్మాస్వరాజ్ ఆంధ్రప్రదేశ్ నేతల విజ్ఞప్తులను పట్టించుకోకుండా తెలంగాణకు మద్దతు తెలిపారు' అని పదేపదే చెప్పిన ఆ రాష్ట్ర బీజేపీ నేతలు... ఇప్పుడు కేంద్రం చర్యను ఎలా సమర్థించాలో తెలియక తికమకపడుతున్నారు.
కేంద్రాన్ని సమర్ధిస్తే ప్రజాగ్రహం చవిచూస్తారు... ప్రజల్ని సమర్ధిస్తే పార్టీ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు మౌనాన్ని ఆశ్రయించారు. నిన్న మొన్నటి వరకు ఆదివాసీల తరఫున ఉద్యమాలు చేస్తామని చెప్పి, ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలపవద్దని కోరుతూ, కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ నేతలు ప్రధాన మంత్రిని, పార్టీ అధిష్ఠానాన్ని కలిసి వినతి పత్రాలు సమర్పించారు. అయినా అధిష్ఠానం వారి అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా పోలవరం ముంపు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపేసింది.
ఇప్పుడు ఉద్యమాలు చేసినా ఫలితం ఉండదు. అలా అని మౌనంగా ఉండలేని పరిస్థితి. విద్యుత్ విషయంలో పీపీఏల రద్దు, హైదరాబాద్ శాంతి భద్రతలపై గవర్నర్ కు ప్రత్యేక అధికారాలు, పోలవరం ముంపు గ్రామాలు ఆంధ్రప్రదేశ్ లో కలపడాన్ని తెలంగాణ బీజేపీ నేతలు సహించలేకపోతున్నారు. అలాగని కేంద్రానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేకపోతున్నారు. దీంతో వారి పరిస్థితి ముందు గొయ్యి, వెనక నుయ్యిలా తయారైంది.
More Telugu News
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన
-
'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
-
ఏటీఎంలో ఈ 5 తప్పులు చేస్తున్నారా? మీ బ్యాంకు ఖాతా ఖాళీ కావచ్చు!
-
సివిల్స్ కోచింగ్ విద్యార్థులకు అండగా తెలంగాణ ప్రభుత్వం.. ఆర్థిక సాయం పెంపు