కిరోసిన్ కోటా పెంచండి: ప్రధానికి జయలలిత వినతి
తమిళనాడుకు కేటాయిస్తున్న కిరోసిన్ కోటాను పెంచాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలోని రేషన్ కార్డుల లెక్కల ప్రకారం నెలకు 65,000 కిలోలీటర్ల కిరోసిన్ అవసరమవుతుండగా, యూపీఏ హయాంలో తమిళనాడుకు కేవలం 59,780 కిలోలీటర్ల కిరోసిన్ మాత్రమే విడుదలైంది.
అంతేగాక యూపీఏకు వ్యతిరేకంగా జయలలిత మాట్లాడిన ప్రతిసారి కేంద్రం తమిళనాడు కిరోసిన్ కోటాకు కత్తెర వేసేది. ఈ తరహాలో దాదాపు పది సార్లు కోతలు విధించిన విషయాన్ని జయలలిత మోడీకి రాసిన లేఖలో ప్రస్తావించారు.