ముఖ్యమంత్రి పదవి బంగారు కిరీటం కాదు, ముళ్లకిరీటం: చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముఖ్యమంత్రి పదవి బంగారు కిరీటం కాదు, ముళ్లకిరీటం: చంద్రబాబు

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో ఏపీఎన్జీవోల అభినందన సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని బాబు చెప్పారు. హైదరాబాదును తెలుగువారి కోసం అభివృద్ధి చేశానని అన్నారు. అమెరికా ఆఫీసుల చుట్టూ తిరిగి హైదరాబాదును అభివృద్ధి చేశానన్నారు. "ముఖ్యమంత్రి పదవి బంగారు కిరీటం కాదు, ముళ్లకిరీటం" అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కూర్చోవడానికి ప్రస్తుతం కార్యాలయం కూడా లేదన్నారు. ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నామన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఉద్యోగులు చేపట్టిన ఉద్యమం చారిత్రాత్మకమని ఆయన అన్నారు. ఉద్యోగులు 84 రోజుల పాటు ఉద్యమం చేశారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగువారికి రెండు కళ్లు అని చంద్రబాబు చెప్పారు. రెండు ప్రాంతాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపమని తాను చెప్పానన్నారు. సమన్యాయం అని అంటే అప్పుడు తనను ఎగతాళి చేశారన్నారు. కాంగ్రెస్ వారు అనుసరించింది తప్పుడు విధానమని మోడీ కూడా చెప్పారని బాబు తెలిపారు. కాంగ్రెస్ అడ్డగోలుగా రాష్ట్ర విభజన చేసిందన్నారు. ఏపీని ఆదుకుంటామని మోడీ భరోసా ఇచ్చేలా ఒప్పించానని ఆయన అన్నారు.

More Telugu News