నేత కార్మికులకు రాయితీపై సోలార్ దీపాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నేత కార్మికులకు రాయితీపై సోలార్ దీపాలు

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని చేనేత కార్మికులకు రాయితీపై సోలార్ దీపాలను అందించేందుకు కేంద్రం ప్రత్యేకంగా నిధులు విడుదల చేయనుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. శనివారం మంగళగిరిలోని తెనాలి రోడ్డులోని మార్కండేయ ఆలయ సమీపంలో జిల్లా చేేనేత జౌళి శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సోలార్ దీపాల ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. కార్మికులకు రాయితీపై సోలార్ దీపాలను అందించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపిందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. కేంద్రం మంజూరు చేసిన రూ. 70 కోట్లతో మంగళగిరిలోనే చేనేత క్లస్టర్ ను ఏర్పాటు చేయాలని ఆప్కో చైర్మన్ హనుమంతరావు కోరారు.

More Telugu News