ఇప్పుడూ అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం: శైలజానాథ్
ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి మొత్తం ఒక్క హైదరాబాద్ లోనే కేంద్రీకృతమైపోయిందని, తాజాగా రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇదే రకమైన పరిస్థితి తలెత్తే ప్రమాదం లేకపోలేదని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి శైలజానాథ్ శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రాజధానిని గుంటూరు, విజయవాడల మధ్య ఏర్పాటు చేయాలని చెబుతున్న టీడీపీ సర్కారు తాజాగా కేంద్రం ప్రకటించిన ఎయిమ్స్ ను కూడా గుంటూరుకే తరలించేందుకు యత్నిస్తోందని ఆయన శనివారం ఆరోపించారు. తత్ఫలితంగా అభివృద్ధి మొత్తం గుంటూరు పరిసరాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉందన్నారు. కేంద్రం ప్రకటించిన ఎయిమ్స్ ను అనంతపురంలో ఏర్పాటు చేయడంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు, కర్నూలు-అనంతరపురం మధ్యలో ఉప రాజధానిని నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.