బంద్ ఎఫెక్ట్... ఓయూ పీజీ కౌన్సెలింగ్ రేపటికి వాయిదా!
ఉస్మానియా యూనివర్శిటీ పీజీ సెట్ కౌన్సెలింగ్ రేపటికి వాయిదా పడింది. ఈ మేరకు ఓయూ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో నేడు బంద్ జరుగుతున్న కారణంగా కౌన్సెలింగ్ వాయిదా వేశామని చెప్పారు. కాగా, తెలంగాణ జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.