’నగరం‘ ఘటనలు పునరావృతం కాకుండా చూడండి: జగన్
గ్యాస్ పైపు లీకేజీ వల్ల తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో చోటుచేసుకున్న ఘటనల తరహాలో భవిష్యత్తులో ప్రమాదాలు చోటుచేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. ప్రమాద బాధితులకు నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులుపుకోవడం కాదని, ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా జాగ్రత్తలు తీసుకునేలా ఆయా సంస్థలపై ఒత్తిడి తీసుకురావాలని ఆయన మంత్రిని కోరారు.