హైటెక్స్ లో... ప్రయాణం మరియు పర్యాటక ప్రదర్శన ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైటెక్స్ లో... ప్రయాణం మరియు పర్యాటక ప్రదర్శన ప్రారంభం

హైటెక్ సిటీ సమీపంలోని హైటెక్స్ ప్రాంగణంలో ప్రయాణం మరియు పర్యాటక ప్రదర్శన ప్రారంభమయ్యింది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ‘ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాలు స్టాళ్లు నెలకొల్పాయి. శ్రీలంక, థాయ్ లాండ్, సింగ్ పూర్ తదితర దేశాల టూరిజం శాఖలు కూడా ఇక్కడ ప్రదర్శనశాలలను ఏర్పాటు చేయడం విశేషం. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెయిర్ ప్రధానోద్దేశం పర్యాటక రంగానికి ప్రోత్సాహం కల్పించడమేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ప్రస్తుతం టూరిజం ద్వారా రూ.130 కోట్ల ఆదాయం వస్తున్నదని ఆయన పేర్కొన్నారు.

More Telugu News