రక్త చరిత్ర రాస్తున్నారు: వాసిరెడ్డి పద్మ
కొత్త రాష్ట్రంలో కొత్త చరిత్రకు బదులు రక్త చరిత్ర రాస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ టీడీపీ నేతలపై విరుచుకుపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తుపై యోచించాల్సిన టీడీపీ నేతలు నిత్యం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై అవాకులు, చవాకులు పేలుతున్నారని శుక్రవారం విమర్శించారు. ప్రజల పక్షాన పోరు సాగిస్తున్న తమ నేత రాష్ట్రపతి, కేంద్ర మంత్రులను కలిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నించారు.
కేంద్ర మంత్రులను కలిస్తే కేసుల మాఫీ కోసమేనంటూ కలిశారంటూ టీడీపీ నేతలు న్యాయ వ్యవస్థను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కేసుల మాఫీని పక్కన పెట్టి రుణ మాఫీ గురించి టీడీపీ నేతలు మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు.