ఎంపీలకు స్పీకర్ క్లాస్ తీసుకున్నారు
లోక్ సభ సభ్యులకు స్పీకర్ సుమిత్రా మహాజన్ క్లాస్ తీసుకున్నారు. సభలో మర్యాదపూర్వకంగా, హుందాగా ప్రవర్తించాలని ఆమె సభ్యులకు సూచించారు. లోక్ సభ సభ్యుల ప్రవర్తన ఏ మాత్రం బాగోలేదని, దేశమంతా మనని చూస్తున్నారని ఆమె ఈ సందర్భంగా సభ్యులకు చెప్పారు. ఏ పార్టీ సభ్యులు కూడా సభలోకి ప్లకార్డులు తీసుకురావద్దని, వెల్ లోకి రావద్దని సుమిత్రా మహాజన్ చెప్పారు. తమ తమ స్థానాల్లోనే ఉండి నిరసన తెలపాలని ఆమె పేర్కొన్నారు. స్పీకర్ పక్షపాత ధోరణితో ప్రవర్తిస్తున్నారంటూ తృణమూల్ సభ్యులు నిన్న ఆరోపించారు. ఈ నేపథ్యంలో స్పీకర్ సభ్యులకు పాఠం చెప్పినట్టు తెలిసింది.