Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కర్నూలు జడ్పీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు

జిల్లాపరిషత్ లకు పరోక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, కర్నూలు నగరంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. స్థానిక జిల్లాపరిషత్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతోపాటు, నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలను విధించారు. రాజ్ విహార్ నుంచి కొండారెడ్డి బురుజుకు వెళ్లే వాహనాలను ఐదు రోడ్ల కూడలి మీదుగా మళ్లిస్తున్నారు. బళ్లారి చౌరస్తా, నంద్యాల చెక్ పోస్టు వైపు వెళ్లే వాహనాలను ఆయకర్ భవన్, మౌర్య ఇన్ ల మీదుగా పంపుతున్నారు.

More Telugu News