తల్లిదండ్రులపై సుపుత్రికల కేసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తల్లిదండ్రులపై సుపుత్రికల కేసులు!

కలికాలం అంటే ఇదేనేమో... తమకు ఇంకా పెళ్లి చేయడం లేదని ఏకంగా తల్లిదండ్రులపైనే కేసులు పెట్టారు సుపుత్రికలు! గత ఏడాది సౌదీలో 23 మంది మహిళలు తమ తల్లిదండ్రులపై ఇలాంటి కేసులు నమోదు చేసినట్టు నేషనల్ సొసైటీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది. రియాద్ లో 11 మంది, మదీనాలో నలుగురు, దామ్మమ్, మక్కాల్లో ఇద్దరేసి, జెడ్డా, బైజాన్ లో ఒక్కొక్క మహిళ తమకు పెళ్లి చేయడం లేదని కేసులు పెట్టారని అరబ్ న్యూస్ పేర్కొంది. అరబిక్ లో ఇలాంటి కేసులను 'ఆదిల్' అంటారు. 'ఆదిల్' నుంచి మహిళలకు రక్షణ కల్పించాలని మానవ హక్కుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
యుక్త వయసు వచ్చిన తరువాత పెళ్లి చేసుకునే విధంగా చట్టం తీసుకురావాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. కేసులు నమోదు చేసిన మహిళలు తమ తల్లిదండ్రులను కేసుల నుంచి విముక్తి చేయాలని కోరుతున్నారని సామాజిక కార్యాకర్తలు తెలిపారు. తమపై కేసులు నమోదు చేయడంతో వారిని తల్లిదండ్రులు దూరం పెడుతున్నారని, సొంత సంపాదనతోనే బతకాలంటున్నారని మహిళలు వాపోతున్నారు. దీంతో వారు తల్లిదండ్రులను విముక్తులను చేయాలని కోరుతున్నారు.

More Telugu News