Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సుప్రీంకోర్టులో కేసులున్నాయి... అందుకే అక్కడ ఇళ్లు నిర్మించుకోలేదు: అశోక్ బాబు

ఏపీఎన్జీవోల భూములను స్వాధీనం చేసుకోవాలనుకోవడం తెలంగాణ ప్రభుత్వ అనాలోచిత చర్య అని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం కేటాయించిన భూములపై సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయని... అలాంటప్పుడు ఆ భూముల్లో ఇళ్లను ఎలా నిర్మించుకుంటామని టీ ప్రభుత్వాన్ని నిలదీశారు. 40 శాతం తెలంగాణ ఉద్యోగులకు కూడా అందులోనే స్థలాలు ఉన్నాయని తెలిపారు. తన నిర్ణయాన్ని టి.ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై చర్చించేందుకు టి.సీఎం, టి.డిప్యూటీ సీఎంలను కలుస్తామని చెప్పారు.

More Telugu News