సోమిరెడ్డికి అంబటి సూచన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోమిరెడ్డికి అంబటి సూచన

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్థానాలను నెరవేర్చాలని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వైయస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు సూచించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, హామీలు అమలు చేయలేకపోతే ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారోనన్న భయంతోనే జగన్ పై అవాకులు చవాకులు పేలుతున్నారని అన్నారు. వైఎస్సార్సీపీకి విప్ జారీ చేసే అధికారం ఉందని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు నిస్సిగ్గుగా బరితెగించి ఫిరాయింపులను ప్రోత్సహించడం సిగ్గుచేటని ఆయన పేర్కొన్నారు. పిరాయింపులను ప్రోత్సహించడం మానకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన తెలిపారు.

More Telugu News