గెయిల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గెయిల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు

తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ గ్యాస్ పైప్ లైన్ పేలుడు ఘటనలో ఇప్పటి వరకు 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనకు కారణమైన గెయిల్ సంస్థపై ఈ రోజు పలు సెక్షన్ల కింద కేసు నమోదయింది. 304ఏ, 286, 338, 337 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు. మాలమహానాడు నేత రత్నాకర్, స్థానిక వీఆర్వో ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News