అమర్ నాథ్ యాత్ర ప్రారంభం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అమర్ నాథ్ యాత్ర ప్రారంభం

హిమగిరులలో కొలువైన అమరనాథేశ్వరుడిని దర్శించుకునేందుకు భక్తుల యాత్ర ప్రారంభమైంది. 1160 మంది భక్తులతో కూడిన తొలి బృందం జమ్మూ కాశ్మీర్లోని బాల్తల్ నుంచి అమర్ నాథ్ గుహ దిశగా బయల్దేరి వెళ్లింది. ఈసారి భక్తులు 20 అడుగుల మంచు శివలింగాన్ని ఆసాంతం దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నారు. పహల్గామ్ మార్గంలో మంచు అడ్డుగా ఉండడంతో యాత్రీకులను మరో మార్గంలో పంపిస్తున్నారు. నాలుగైదు అడుగుల మేర పేరుకుపోయిన మంచును తొలగించేందుకు 300 మంది శ్రమిస్తున్నారు.

More Telugu News