'బియాస్' మృతులకు సంతాపంతో ఏపీ అసెంబ్లీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తొలుత బియాస్ నది ఘటనలో మృతి చెందిన తెలుగు విద్యార్థులకు సంతాపం తెలిపారు. అంతేగాకుండా మృతి చెందిన మాజీ సభ్యులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, విద్యార్థుల మరణం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించినట్టు తెలిపారు. ఘటన వార్త తెలిసిన వెంటనే సంఘటనా స్థలానికి అధికారులను పంపామని సభకు వివరించారు.