ముంబయ్ 'క్యాంపాకోలా'లో మళ్లీ వివాదం
బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిధిలోని క్యాంపాకోలా అక్రమ నివాసాలను కూల్చేసేందుకు వెళ్లిన అధికారులను క్యాంపాకోలా ప్రజలు అడ్డుకున్నారు. దీంతో ఉన్నతాధికారులకు విషయం తెలిపిన అధికారులు వెనుదిరిగారు. క్యాంపాకోలా నివాసాలను కూల్చివేయొద్దంటూ దాఖలైన పిటిషన్ ను గతంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది. దానితోపాటే నివాసాలను ఖాళీ చేసేందుకు క్యాంపాకోలా వాసులకు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. దీంతో బీఎంసీ అధికారులు అక్కడికి వెళ్లారు. అధికారులను కాలనీ ప్రధాన ద్వారం వద్ద అడ్డుకున్న కాలనీ వాసులు గేట్లు మూసేసి ప్రతిఘటించారు. దీంతో అధికారులు వెనుదిరిగారు.
ఈ సందర్భంగా బీఎంసీ అధికారులు మాట్లాడుతూ, క్యాంపాకోలా వాసుల బాధను అర్థం చేసుకోగలం కానీ, అక్రమ నివాసాలను ఖాళీ చేయాలి కదా? అన్నారు. ఖాళీ చేయాల్సిందేనని సుప్రీంకోర్టు కూడా ఆదేశించిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఇళ్లు ఖాళీ చేయనందున క్యాంపాకోలా వాసుల విద్యుత్, కుళాయి, గ్యాస్ కనెక్షన్లను కట్ చేసేందుకు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు.