తెలంగాణ మెడికల్ కాలేజీలను మీటింగ్ కి పిలిచిన సీఎస్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాలను చీఫ్ సెక్రటరీ సమావేశానికి ఆహ్వానించారు. రేపు ఉదయం 11 గంటలకు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో సీఎస్ సమావేశం జరుపనున్నారు. ఈ సమావేశంలో మెడికల్ కళాశాలల్లోని ఫీజులపై చర్చించనున్నారని సీఎస్ తెలిపారు. వైద్య కళాశాలల్లోని సీట్లలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సూచించిన మరుసటిరోజే తెలంగాణ ప్రభుత్వం కళాశాల యాజమాన్యాలతో చర్చించడం విశేషం.