నాసిక్ ఉల్లి మార్కెట్ లో కార్మికుల సమ్మె విరమణ... ఇక ధరలు తగ్గే అవకాశం!
మహారాష్ట్రలోని నాసిక్ ఉల్లి మార్కెట్ లో కార్మికులు ఇవాళ సమ్మె విరమించారు. వేతనాలు పెంచాలంటూ వీరు గత పది రోజులుగా సమ్మె చేస్తున్నారు. కార్మికుల సమ్మె ముగియడంతో రేపటి నుంచి నాసిక్ ఉల్లి మార్కెట్ నుంచి సరఫరా ప్రారంభమవుతుంది. దాంతో మరికొన్ని రోజుల్లో ఉల్లిపాయల ధరలు తగ్గే అవకాశం ఉంది.