జార్ఖండ్ లో పార్టీ పగ్గాలు యశ్వంత్ సిన్హాకు ఇవ్వాలంటున్న అద్వానీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జార్ఖండ్ లో పార్టీ పగ్గాలు యశ్వంత్ సిన్హాకు ఇవ్వాలంటున్న అద్వానీ

జార్ఖండ్ లోని హజారిబాగ్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న పార్టీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హాను ఈ రోజు అగ్రనేత ఎల్ కే అద్వానీ కలిశారు. దాదాపు గంటపాటు వీరిద్దరూ పలు విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం. అనంతరం అద్వానీ మీడియాతో మాట్లాడుతూ, జైలు నుంచి రాగానే జార్ఖండ్ లో పార్టీ పగ్గాలు యశ్వంత్ సిన్హాకు ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరతానన్నారు. అంతేగాక తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని ఆయనే నడుపుతారని పేర్కొన్నారు. జార్ఖండ్ కు చెందిన ఓ సీనియర్ ప్రభుత్వాధికారిపై దాడి చేశారంటూ పలు ఆరోపణలు ఎదుర్కొన్న సిన్హాను ఈ నెల 2న పోలీసులు అరెస్టు చేశారు.

More Telugu News