బ్యాంకర్ల నోటీసులతో రైతులెవరూ అధైర్యపడొద్దు: మంత్రి ప్రత్తిపాటి
బ్యాంకర్ల నోటీసులతో ఆంధ్రప్రదేశ్ లోని రైతులెవరూ అధైర్యపడొద్దని వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. రైతు రుణాల మాఫీ ప్రభుత్వ నిర్ణయమని, రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. రెండు రోజుల్లో బ్యాంకర్లతో సమావేశమై రుణాల మాఫీపై స్పష్టత ఇస్తామన్నారు. బ్యాంకర్లతో రైతులెవరకీ ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఈలోగా రైతులెవరూ రుణాలు చెల్లించవద్దన్నారు.