సినీ నటులపై అభిమానానికి దేశాలు, ఖండాలు అడ్డు కావని మరోసారి స్పష్టమైంది. సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను అమెరికా, మిచిగాన్ రాష్ట్రంలోని డెట్రాయిట్ నగరంలోని అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా బర్త్ డే కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో మందల సతీష్, సునీల్ పంత్ర, కిరణ్ దుగ్గిరాల, హర్ష పోలవరపు, రవి చొప్పలపూడి తదితరులు పాల్గొన్నారు. అభిమానులు సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు నిర్వహించాలని బాలయ్య ఇచ్చిన పిలుపు మేరకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సెయింట్ జాన్ చర్చిలో రెడ్ క్రాస్ సంస్థ ఆధ్వర్యంలో ఈ రక్తదాన శిబిరం జరిగింది.