నా సీనియారిటీ వల్లే డిప్యూటీ సీఎం పదవి వచ్చింది: చినరాజప్ప
22 ఏళ్లుగా ఓ కార్యకర్తగా టీడీపీకి సేవచేశానని... తన సీనియారిటీ వల్లే తనకు ఏపీ డిప్యూటీ సీఎం, హోం మంత్రి పదవి దక్కాయనీ చింతకాయల చినరాజప్ప తెలిపారు. చంద్రబాబు కేబినెట్ బ్రహ్మాండంగా సెట్ అయిందని అన్నారు. తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కాపులకు డిప్యూటీ సీఎం ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నారని చెప్పారు.