వెనుక తగలబడుతుంటే ముందు ముచ్చటగా పెళ్లాడిన జంట
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెనుక తగలబడుతుంటే ముందు ముచ్చటగా పెళ్లాడిన జంట

భూకంపం వచ్చినా.. బ్రహ్మాండం బద్దలైనా సరే అనుకున్న సమయానికి పెళ్లాడాల్సిందేనన్నట్లు... ఓ జంట చుట్టూ అడవి తగలబడి పోతుంటే ఆ పక్కనే ప్రశాంతంగా పెళ్లి చేసుకున్నారు. అమెరికాలోని ఓరేగాన్ కు చెందిన మైకేల్ వాల్బర్, ఏప్రిల్ హార్ట్ లే ఆరు బయట ప్రకృతి మధ్యలో వివాహం చేసుకోవాలనుకున్నారు. మూహూర్తం పోయిన శనివారం. స్థలం బెండ్ సమీపంలో. వీరి పెళ్లి ముహూర్త సమయానికి పక్కనే ఉన్న అడవిలో కార్చిచ్చు మొదలైంది. తక్కువ సమయంలోనే అది పెద్దదిగా మారింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోయి వేరొక చోట పెళ్లి చేసుకోవాలని ఆ జంటకు సూచించారు. కానీ, వారు వినలేదు. ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ ఒకరి చేతుల్లో ఒకరు ఒదిగిపోయి కార్చిచ్చు సాక్షిగా కల్యాణం పూర్తి చేసుకున్నారు.

More Telugu News