హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇవాళ ఉదయం ఓ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆస్ట్రేలియా నుంచి దుబాయ్ వెళ్తున్న విమానంలో ఓ ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేసినట్లు సమాచారం. గుండెపోటుకు గురైన ప్రయాణికుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.