తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. వెంటనే తెలంగాణ తొలి అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే మధుసూదనాచారి తన సీటులో ఆసీనులయ్యారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించిన జానారెడ్డి, పలువురు సభ్యులు ఆయనకు అభినందనలు తెలిపారు.