Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి వస్తున్నాయ్

మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర కోస్తా మీదుగా బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి, ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నాయి. మరో వైపు అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరో 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు చెప్పారు.

More Telugu News