చంద్రబాబుకు పూర్తి సహకారమందిస్తాం: మోడీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుకు పూర్తి సహకారమందిస్తాం: మోడీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకి ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టెర్లో శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు, మంత్రులు సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురోగతికి పాటుపడాలని కోరుకుంటున్నానని అన్నారు. చంద్రబాబు పట్టుదల, కార్యదక్షత ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి దిశగా నడిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆభివృద్ధి చెందేందుకు కావాల్సిన పూర్తి సహకారాన్ని కేంద్రం అందజేస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

More Telugu News