Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రపంచంలో అతి చిన్న యాంటెన్నా

సూపర్‌ కాంపాక్ట్‌ అల్ట్రా వైడ్‌బ్యాండ్‌ యాంటెన్నాలలో ప్రపంచంలోనే అతి చిన్న దానిని తాము అభివృద్ధి చేసినట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇళ్లలోనూ మిలిటరీ ప్రాంతాల్లోనూ దీన్ని వినియోగించవచ్చునని అంటున్నారు. మెస్రాలోని బిర్లా ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని ప్రొఫెసర్‌ శ్రీకాంత్‌ పాల్‌ , రీసెర్చి స్కాలర్‌ మృణాయ్‌ చక్రవర్తితో కలిసి దీన్ని అభివృద్ధి చేశారు. తమ యాంటెన్నా ప్రపంచంలోనే అతి చిన్నదని 14 ఎంఎం I 11 ఎంఎం ఉంటుందని చెప్పారు. దీనివల్ల భవిష్యత్తులో ఈ రంగంలో శాస్త్రపరిశోధనల్లో అనేక మార్పులు వస్తాయని కూడా వారంటున్నారు.

More Telugu News