మామయ్య సీఎం కావడం గర్వకారణం: జూనియర్ ఎన్టీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మామయ్య సీఎం కావడం గర్వకారణం: జూనియర్ ఎన్టీఆర్

మామయ్య, టీడీపీ అధినేత చంద్రబాబు నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కావడం గర్వకారణమని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. కృష్ణా జిల్లా నిమ్మకూరుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మహానుభావుడు ఎన్టీఆర్ ఆశీస్సులు తీసుకోవడానికే నిమ్మకూరు వచ్చినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎల్లకాలం ప్రజలకు సేవలందిస్తూ ఉండాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న ప్రశ్నకు... 'బ్రహ్మాండంగా' అంటూ బదులిచ్చారు.

More Telugu News