Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలి: ప్రధానిని కోరిన కేసీఆర్

ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా ప్రధానికి కేసీఆర్ వినతి పత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకరించాలని ఆయన కోరారు. తెలంగాణలో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు, ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా, పరిశ్రమలకు పన్ను రాయితీనివ్వాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. మూసీనది ప్రక్షాళనకు కేంద్రం నిధులివ్వాలని ప్రధానికి ఆయన విన్నవించారు. మరికాసేపట్లో కేసీఆర్ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమవుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి ఆయన రాష్ట్రపతిని కలవనున్నారు.

More Telugu News