ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియామకం చెల్లదంటూ పిటిషన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముఖ్యమంత్రిగా కేసీఆర్ నియామకం చెల్లదంటూ పిటిషన్

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పదవిలో కొనసాగకుండా నిలువరించాలని కోరుతూ పి.వి.కృష్ణయ్య అనే న్యాయవాది నిన్న (గురువారం) 'రిట్ ఆఫ్ కో వారెంట్' రూపంలో పిటిషన్ వేశారు. ఆయన సీఎంగా ఎలా కొనసాగుతున్నారో వివరణ ఇచ్చేలా ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గవర్నర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శి, కేసీఆర్ లను అందులో ప్రతివాదులుగా చేర్చారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ ను నియమించి గవర్నర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోనే సార్వత్రిక ఎన్నికలు జరిగి ఫలితాలు కూడా వెలువడ్డాయని, ఆ వెంటనే మెజారిటీ సాధించిన పార్టీలను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి, అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ కోరాల్సి ఉండగా ఆయన ఆ పని చేయలేదని పిటిషనర్ పేర్కొన్నారు.

More Telugu News