తొలి హామీకే తూట్లా?: కిషన్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తొలి హామీకే తూట్లా?: కిషన్ రెడ్డి

'తానిచ్చిన తొలి హామీకే టీఆర్ఎస్ పార్టీ తూట్లు పొడిస్తే ఎలా?' అంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని అన్ని రకాల పంట రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఏడాది పంట రుణాలను మాత్రమే మాఫీ చేస్తామన్న నిర్ణయాన్ని కేసీఆర్ పునఃపరిశీలించాలని కిషన్ రెడ్డి సూచించారు. పోలవరం ముంపు ప్రాంతాల బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తరువాత ముంపు ప్రాంతాలను తెలంగాణలో కలపాలని ఆయన సూచించారు.

More Telugu News