హైకోర్టు ముందు ఐదుగురు మహిళల అర్ధనగ్న నిరసన
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హైకోర్టు ముందు ఐదుగురు మహిళల అర్ధనగ్న నిరసన

ఉత్తరప్రదేశ్ లో జరుగుతున్న అత్యాచారాలపై మలయాళీ మహిళలు తమదైన శైలిలో నిరసన తెలిపారు. 'స్త్రీ కూటైమ' అనే దళానికి చెందిన ఐదుగురు మహిళా కార్యకర్తలు కేరళ హైకోర్టు ముందు నగ్నంగా మారి, తరువాత ఒంటి చుట్టూ జాతీయ జెండాలోని (ఆకుపచ్చ, తెలుపు, కాషాయం) మూడు రంగుల్ని ప్రతిబింబించేలా వస్త్రాలు చుట్టుకుని అత్యాచారాలు నిరోధించాలంటూ నినాదాలు చేశారు.

'స్త్రీ కూటైమ' దళంలో 30 మంది మహిళలు ఉండగా వారిలో ఐదుగురు మాత్రమే అర్ధనగ్న నిరసన తెలుపగా మిగిలిన 25 మంది నినాదాలు చేశారు. దీంతో రంగంలోకి దిగి పోలీసులు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా, అసభ్యంగా ప్రవర్తించారని, బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేశారని ఆ ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. తరువాత బెయిల్ పై వారిని విడిచిపెట్టారు.

More Telugu News