సీఎం కేసీఆర్ ను కలసిన జీవిత, రాజశేఖర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బీజేపీ నేతలు జీవిత, రాజశేఖర్ దంపతులు కలిశారు. సినీ పరిశ్రమలో కొన్ని కుటుంబాల ఆధిపత్యం పోవాలని కేసీఆర్ కు తెలిపినట్లు వారు చెప్పారు. పాతికేళ్ల నుంచి కొన్ని కుటుంబాలే సినీ పరిశ్రమను ఏలుతున్నాయని, చిన్న సినిమాలు లాభపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడాలన్నారు.