2013 జూన్ నుంచి 2014 జూన్ వరకే రైతులకు రుణ మాఫీ చేస్తామంటూ నిన్న (బుధవారం) తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నేత డీకే అరుణ స్పందిస్తూ, కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. రైతులకు షరతులు లేని రుణమాఫీ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అటు సీపీఐ నేత నారాయణ మాట్లాడుతూ, రుణమాఫీపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. కాలపరిమితి విధించడం అంటే, ఎన్నికల హామీని నిలబెట్టుకోలేక పోవడమేనన్నారు. వ్యవసాయ రుణాలు సహా అన్ని రుణాలు మాఫీ చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.