కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, నౌకాయాన శాఖలకు మంత్రిగా ఉన్న నితిన్ గడ్కరీకి మరో శాఖ అదనపు బాధ్యతను ప్రధాని నరేంద్ర మోడీ అప్పగించారు. గోపీనాథ్ ముండే అకాల మరణంతో ఏర్పడిన శూన్యాన్ని గడ్కరీతో మోడీ పూరించారు. గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతను గడ్కరీకి కేటాయించారు.