నిర్మాతలుగా మారిన బాలీవుడ్ ముద్దుగుమ్మలు జూహీచావ్లా, శిల్పాశెట్టి, దియామీర్జాల జాబితాలో మరోసినీ నటి చేరింది. 'యువ' సినిమా ద్వారా తెలుగు సినీ అభిమానులకు పరిచయమైన బాలీవుడ్ డ్రీమ్ గర్ల్ హేమమాలిని, ధర్మేంద్రల కుమార్తె ఇషాడియోల్ నిర్మాతగా మారింది. ఇషా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై చిత్రాలు నిర్మించనున్నానని ఆమె వెల్లడించారు. 2012లో భరత్ తక్తానీని పెళ్లి చేసుకున్న ఇషాడియోల్ ఆ తరువాత సినిమాల్లో నటనకు స్వస్తి చెప్పింది.