యూపీలో శాంతి భద్రతలు లేవు...రాష్ట్రపతి పాలన విధించండి: ఆర్కే సింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యూపీలో శాంతి భద్రతలు లేవు...రాష్ట్రపతి పాలన విధించండి: ఆర్కే సింగ్

ఉత్తరప్రదేశ్ లో శాంతి భద్రతలు క్షీణించాయని, తక్షణం రాష్ట్రపతి పాలని విధించి, పరిస్థితులను చక్కదిద్దాలని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బీజేపీ ఎంపీ ఆర్.కే.సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, యూపీ ప్రభుత్వ శాఖల్లో ప్రతి విభాగంలో రాజకీయ జోక్యం ఎక్కువైపోయిందని ఆరోపించారు. ముఖ్యంగా పోలీసు విభాగంలో రాజకీయ జోక్యం మితిమీరిపోవడంతో పాలన కుప్పకూలిందని ఆయన అభిప్రాయపడ్డారు.

యూపీలో వరుసగా జరుగుతున్న అత్యాచారాలు, హత్యలు, అరాచకాలను చూస్తుంటే అక్కడ పరిపాలన పూర్తిగా స్తంభించిందని ఎవరికైనా అర్థమవుతుందని ఆయన అన్నారు. సొంత ఇంటిలో జడ్జికే రక్షణ లేకుండా పోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అని ఆయన ప్రశ్నిస్తూ, రాష్ట్రపతి పాలన విధించేందుకు అనువైన పరిస్థితులు యూపీలో ఉన్నాయని స్పష్టం చేశారు.

More Telugu News