వైభవంగా గోవింద రాజస్వామి ధ్వజారోహణ కార్యక్రమం
చిత్తూరు జిల్లా తిరుపతిలో కొలువైన గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వేద పండితులు ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గోవిందరాజస్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక అలంకరణ చేసి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 12 వరకు జరుగనున్నాయి.