సాయంత్రం ఫామ్ హౌస్ కు వెళ్లనున్న కేసీఆర్
సాయంత్రం గజ్వేల్ లో జరుగనున్న సమావేశంలో కేసీఆర్ పాల్గొంటారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కేసీఆర్ పాల్గొంటున్న తొలి సమావేశం ఇది. సమావేశం పూర్తయిన తరువాత ఆయన ఫాం హౌస్ కు వెళ్లనున్నారు. అక్కడ పార్టీలోని ముఖ్యులతో ఆయన భేటీ అవుతారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై వారితో చర్చించనున్నారు.