తిరుపతిలో కొలువైన గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోనే గోవిందరాజస్వామి ఆలయం ఉన్న సంగతి తెలిసిందే. తిరుమలేశుని దర్శనానికి వచ్చే భక్తులు విధిగా గోవిందరాజస్వామిని దర్శించుకొంటారు. ఇవాళ సాయంత్రం సేనాధిపతి ఉత్సవంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరుగనుంది. ఈ ఉత్సవాలు ఈ నెల 12వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరిపేందుకు టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.