దేశంలోకి మరో రెండు రోజుల్లో నైరుతి రుతు పవనాలు ప్రవేశిస్తున్నాయి. మే 18న భారత ఉపఖండంలోకి ప్రవేశించిన రుతుపవనాలు జూన్ మొదటి వారానికి కేరళ తీరాన్ని తాకుతాయని వాతావరణ శాఖాధికారులు అంచనా వేశారు. గత రెండు రోజుల నుంచి వీటిలో కదలిక వచ్చిందని అధికారులు చెప్పారు. వచ్చే 48 గంటల్లో కేరళ, దక్షిణ అరేబియా సముద్రంలోని ప్రాంతాలు, మాల్దీవులు-కొమరిన్ లోని మిగిలిన ప్రాంతాలతో పాటు తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే, ఆంధ్రప్రదేశ్ కు రావడానికి మాత్రం మరికొన్ని రోజుల సమయం పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.