కమల్ హాసన్ కూతురు, కథానాయిక శ్రుతి హాసన్ ప్రముఖ క్రికెటర్ సురేష్ రైనాతో ప్రేమాయణంలో ఉందని సమాచారం. అతడితో డేటింగ్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. వాటి ప్రకారం వారిద్దరూ సహజీవనంలో మునిగి ఉన్నారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ విజయంతో ఇటీవల నిర్వహించిన ఓ పార్టీలోనూ శ్రుతి పాల్గొన్నదట. సురేష్ రైనా ఇటీవల మంచి పనితీరును కనబరుస్తున్న విషయం తెలిసిందే. దీనికి శ్రుతి ఇస్తున్న జోషే కారణమేమో! అయితే, వీరు వీలున్నప్పుడల్లా కలుసుకుంటున్నారని, తమ అనుబంధం విషయంలో సీరియస్ గా ఉన్నారని సమాచారం. శ్రుతి గతంలో నటుడు సిద్ధార్థ్ తో కూడా డేటింగ్ నడిపింది. సురేష్ రైనా కూడా లోగడ కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ కూతురు పూర్ణతో డేటింగ్ చేసినట్లు వార్తలు ఉన్నాయి.