రాష్ట్ర ప్రయోజనాలను, దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక రాష్ట్రం గురించి మాట్లాడమంటే మాట్లాడలేనని చంద్రబాబు అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ తనకు ముఖ్యమేనన్నారు. టీడీపీని రెండు ప్రాంతాల్లో దెబ్బతీయాలని లక్ష్యంగా పనిచేశారన్నారు. మహానాడులో చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేశారు. ప్రజలు అండగా ఉంటారన్న ధైర్యంతోనే తాను ముందుకెళ్లానని చంద్రబాబు చెప్పారు. టీడీపీని ఎన్నో రకాలుగా దెబ్బతీయాలని చూసినా దేనికీ భయపడలేదన్నారు. ఈ ఎన్నికల్లో లభించిన విజయాన్ని ప్రజలకే అంకితమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కార్యకర్తలందరూ కలిసి పనిచేయడం వల్లే విజయం సాధించామని ఆయన చెప్పారు. తాను చేసిన త్యాగాలకు ఇన్నాళ్లకు ఫలితం దక్కిందన్నారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విజ్ఞతను అభినందిస్తున్నానని అన్నారు.